
ఏపీలో కరోనా కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 61, 678 శాంపిల్స్ పరీక్షించగా 1,217 కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా నలుగురు మరణించారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 200,1255కి పెరిగింది. మరణాల సంఖ్య 13,715కి పెరిగింది. కొత్తగా మరో 1535 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,72,399కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,141 యాక్టివ్ కేసులు ఉన్నాయి.