
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 95,327 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 4,250 కేసులు నమోదయ్యాయి. 33 మంది చనిపోయారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి నిన్న 5,570 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 44,773 యాక్టివ్ కేసులు ఉన్నాయి.