
యాస్ తుఫాన్ ఇవాళ ఒడిసాలోని బాలాసోర్ వద్ద తీరం దాటింది. ఉదయం 11.30 నిమిషాలకు తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే ఈ తుఫాన్ వల్ల సుమారు కోటి మంది ప్రభావానికి లోనైనట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. యాస్ తుఫాన్ వల్ల వాతావరణ పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయని, సముద్రం అల్లకల్లోలంగా తయారైనట్లు ఆమె తెలిపారు. బెంగాల్ లో యాస్ తుఫాన్ వల్ల మూడు లక్షల ఇండ్లు ధ్వంసం అయినట్లు సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు.