
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు అద్భుతమైన పథకం దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో దళితబంధుపై సీఎస్ సోమేశ్ కుమార్, ఎస్సీఅభివృద్ధి శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, కలెక్టర్ కర్ణన్ కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రతీ లబ్ధిదారుడికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తామని ప్రకటించారు.