
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ మేరకు సీఎం గెహ్లాట్ ట్వీట్ చేశారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని చెప్పారు. కొవిడ్ నిబంధనల ప్రకారం తాను హొం ఐసోలేషన్ లో ఉన్నానని పేర్కొన్నారు. గెహ్లాట్ భార్య సునీతకు బుధవారం కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా పరీక్షలు చేయించుకోగా కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది.