
టాలీవుడ్ హీరోలు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలకు కరోనా వచ్చి పోయింది. రామ్ చరణ్, బన్నీ లాంటి హీరోలు కూడా కరోనాతో పోరాడి గెలిచారు. ఇప్పడు జూనియర్ ఎన్టీఆర్ ను ఈ మమమ్మారి పలకరించింది. తాజాగా జూనియర్ కు కూడా కరోనా వచ్చింది. ఇదే విషయాన్ని అభిమానులకు ట్విట్టర్ లో తెలియజేసాడు. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ అంతా ధైర్యంగా ఉండండి నేను నా కుటుంబం అంతా చాలా బాగున్నాం. వైద్యుల సంక్షణలోనే ఉన్నాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని తెలిపాడు. దయచేసి కొన్ని రోజులుగా నన్ను కలిసిన వాళ్లు వెంటనే వెళ్లి టెస్ట్ చేయించుకోండి ఇంట్లోనే ఉండండి అంటూ ట్వీట్ చేశాడు.