
పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల బుట్టబొమ్మ పూజా హెగ్డే కరోనా నుంచి కోలుకోగా ఇప్పుడు మరో హీరోయిన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా తనకు కరోనా సోకిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నాను. నేనే క్షేమంగానే ఉన్నాను అని తెలిపింది.