విరాజ్ అశ్విన్ హీరోగా, నటి, యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించిన ‘థాంక్యూ బ్రదర్’ సినిమా ఆహా యాప్ లో ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమాను మాగుంట శరత్ చంద్రారెడ్డితో కలిసి తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మించగా రమేశ్ రాపర్తి దర్శకత్వం వహించారు. మరి సినిమా పరిస్థితి ఏమిటో చూద్దాం.
కథాకమామీషు :
చెప్పుకోటానికి పెద్దగా కథ ఏమి లేదు, ఉన్న కథనే ముచ్చటించుకుంటూ పోతే.. అభి (విరాజ్ అశ్విన్ ) అన్ని రెగ్యులర్ కథలలో లాగే తల్లి ప్రేమను, అలాగే బాధ్యతలను పట్టించుకోకుండా కాసేపు తాగుతూ, అవకాశం ఉంటే మరికొంత సేపు అమ్మాయిల పెదవులు చప్పరిస్తూ మొత్తానికి మొదటి ముప్పై నిముషాల సినిమాని ముందుకు లాక్కెళ్లాడు. ఇక కరెక్ట్ గా ముప్పై నిముషాలకు కథను మలుపు తిప్పాలి అని తెలుగు ఇండస్ట్రీలో అఫీస్ బాయ్ కూడా బలంగా నమ్ముతాడు కాబట్టి,
ఈ సినిమా దర్శకుడు తానూ అదే నమ్ముతాను అన్నట్టు హీరోని ఇంటి నుండి బయటకు వెళ్లిపోయేలా ఒక సీన్ రాసుకుని మొత్తానికి అదే తన కథలోని మలుపు అని మనల్ని కూడా నమ్మించడానికి గట్టి ప్రయత్నం చేశాడు (కాకపోతే, ఈ మలుపు మనకు అలుపు తెప్పించేలా ఉంటుంది లేండి). ఇక హీరోగారు జాబ్ కోసం ట్రై చేయడం, ఎక్కడా జాబ్ రాక అతను తనలోని ఎమోషన్ని (అసలు ఎందుకు ఫీల్ అవుతున్నావు రా నాయనా అని పర్సనల్ గా మనకు అనిపిస్తోంది లేండి) మొత్తానికి హీరోగారు ఆ ఫేక్ ఎమోషన్నే చూపించడానికి నానాకష్టాలు పడుతూ ఉంటాడు.
కాకపోతే పాపం కుర్రాడు విరాజ్ మొహంలో ఎక్స్ ప్రెషన్స్ మచ్చుకు అయినా కానరావు. అలాగే మరొపక్క ప్రియ (అనసూయ) నిండు గర్భవతి, కానీ ఆమె మాత్రం క్లోజ్ షాట్స్ లో కుర్రాళ్లను రెచ్చగొడుతున్నట్టుగా కసిగా చూస్తోన్నట్టు అనిపిస్తోంది. (అనసూయను తప్పు పట్టలేం, అది అలవాటులో ఆమె పొరపాటు కావొచ్చు). ఇక ఆమె భర్త అప్పటికే చనిపోయి ఉంటాడు. మరి అతగాడు సైడ్ క్యారెక్టర్ కాబట్టి, అలాంటి పాత్రలను చంపేయడం మన తెలుగు సినిమాలకు ఆనవాయితీగా వస్తోన్న ఆచారం కాబట్టి ఈ సినిమా దర్శకుడు కూడా ఆ ఆచారాన్ని గుడ్డిగా ఫాలో అయి, తానూ నిఖార్సయిన తెలుగు డైరెక్టర్ అనిపించుకున్నాడు.
ప్లస్ పాయింట్స్:
స్టోరీ లైన్,
సినిమాలోని మెయిన్ ఎమోషన్
నటీనటులు నటన
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే,
డైలాగ్స్,
డైరెక్షన్,
ఓవర్ యాక్షన్,
ఫేక్ ఎమోషన్స్ తో సాగే సిల్లీ డ్రామా.
మరి సినిమాలో నటీనటుల పరిస్థితి ఏమిటి ?
ఈ మూవీలో హీరో విరాజ్ అశ్విన్ పెర్ఫామెన్స్ పర్వాలేదు, ఇక అనసూయ తన పాత్రలో ప్రేక్షకులను మెప్పించినా, ఆమెను ఇలాంటి పాత్రల్లో చూడటానికి ఆమె అభిమానులు ఆసక్తి చూపించరు. మిగిలిన నటీనటుల నటన గురించి అనవసరమైన వివరణలు అనవసరం, తమ పాత్ర పరిధి మేరకు వాళ్ళు నటించాలని ప్రయత్నం చేసినా అందులో వైవా హర్ష లాంటి కొంతమంది సక్సెస్ అయ్యారు. ఇక హీరో తల్లి పాత్రలో నటించిన నటి చాల బాగా నటించింది.
కానీ, ఆమె ఆ పాత్రకు సరిగ్గా సెట్ అవ్వలేదు. ఆమె లుక్స్ అండ్ మేకప్ పై మరింతగా జాగ్రత్త తీసుకోవాల్సింది. ముఖ్యంగా తల్లి సెంటిమెంట్ తో సాగే సినిమాలో, ఆ తల్లి పాత్రలో నిజాయితీ ఉండాలి. కానీ భర్త చనిపోయిన తరువాత, ఆ తల్లి రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో ఇంకా బలంగా చెప్పాల్సింది. తల్లి ఎమోషన్ చుట్టూ తిరిగే సినిమాలో ఆ ఎమోషన్ లో సిన్సియారిటీ, నిజాయితీ లేకపోతే ఆ ఎమోషన్ ఎలా ఎలివేట్ అవుతుందో దర్శకుడికే తెలియాలి.
సినిమా చూడాలా వద్దా ?
చూడకపోవడమే ఉత్తమైన పని అనిపించుకుంటుంది. ఎన్నో గొప్ప సినిమాలు అందుబాటులో ఉన్న ఓటీటీలలో ఇలాంటి సినిమాని చూడకపోవడం తెలివైన పని అనిపించుకుంటుంది. ఈ ‘థాంక్యూ బ్రదర్’లో ఎమోషనల్ డ్రామా ఉన్నా.. స్లో నేరేషన్, సింపుల్ ప్లే, సింగిల్ ప్లాట్ ఇలా మొత్తంగా ఈ సినిమా ఒక బోరింగ్ డ్రామా. కాబట్టి ఈ సినిమా జోలికి వెళ్ళకండి.
oktelugu.com రేటింగ్ – 2/5
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Thankyou brother movie review
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com