
ఏపీలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 20,034 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 82 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,81,133 చేరింది. మరణాలు 8,289 కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ లక్షకుపైగా శాంపిళ్లను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా అంతకంతకు విస్తరిస్తుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది.