
హైదరాబాద్ నగరంలో కరోనా అదుపులోనే ఉందని సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం చార్మినార్ ప్రాంతంలో పర్యటించిన అంజనీ కుమార్ లాక్ డౌన్ అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాలతో పోల్చుకుంటే కరోనా కట్టడిలో హైదరాబాద్ బెటర్ అని అన్నారు. హైదరాబాద్ లో కేసుల తీవ్రత తక్కువగా ఉందని, మరణాల రేటు కూడా అత్యల్పంగా ఉందని సీపీ తెలిపారు.