
అసోం రాష్ట్రంలోని దిబ్రూఘడ్ జిల్లాలోని జలోని ఎస్టేట్ లో 133 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ ఎస్టేట్ ను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. జలోని టీ ఎస్టేట్ లో 133 మంది కార్మికులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 133 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. దీంతో తాము అప్రమత్తమై టీ ఎస్టేట్ కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించామని దిబ్రూఘడ్ డిప్యూటీ కమిషనర్ పల్లవ్ గోపాల్ చెప్పారు. టీఎస్టేట్ లోని కార్మికులకు కరోనా లక్షణాలు లేకున్నా పాజిటివ్ అని తేలిందని అధికారులు చెప్పారు. అసోంలో తాజాగా 31,262 మందికి కరోనా సోకింది.