
మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఎన్ఐ సెట్ 2021 వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో వచ్చే నెల జరగాల్సిన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ ( ఐఎన్ఐ సెట్ ) ను వాయిదా వేస్తున్నట్లు ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ ప్రకటించింది. జూలై సెషన్ కు సంబంధించిన ప్రవేష పరీక్ష మే 8 న జరగాల్సి ఉంది.