
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో కరోనా తీవ్ర కలకలం రేపుతున్నది. థర్మల్ ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే కరోనా బారిన పడి విలవిలాడుతున్నారు. కొవిడ్ బారిన పడిన వారిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇవాళ ముగ్గురు ఉద్యోగులు మరణించారు. దీంతో కార్మికుల, ఉద్యోగులు విధులకు హాజరుకావాలంటే హడలిపోతున్నారు. ఏపీలో నిత్యం 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.