
దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజూ మూడు లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఇలా రోజువారీ మరణాలు మూడు వేలు దాటడం ఇదే మొదటి సారి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,62,770 పాజిటివ్ కేసులు నమోదవగా, 3286 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,79,99,077 కు చేరగా, కరోనా మరణాలు 2,01,180 వద్ద నిలిచాయి.