
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరోనా మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయని ఆ రాష్టర ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చందబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కుప్పంలో కరోనా రోగి ప్లాట్ ఫామ్ పైనే మరణించడం పై ఆయన విచారం వ్యక్తం చేశారు. కుప్పం ఘటన రాష్ట్రంలో కరోనా పరిస్థితికి అద్దం పడుతుందని అన్నారు. సీఎం జగన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.