
ఉప ఎన్నికలు వస్తేనే ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తోందని భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఈటల మాట్లాడారు. 2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్ర చేశారని తెలిపారు. తెరాస నేతలు తన ప్రత్యర్థికి డబ్బులు పంపించారని పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు చేసిన విదంగానే తను కూడా హుజూరాబాద్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు ఈటల చెప్పారు.