
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును డిస్ క్వాలిఫై చేయాలని కోరుతూ లోక్ సభ స్వీకర్ ఓం బిర్లాకు వైసీపీ మరోసారి ఫిర్యాదు చేసింది. వైకాపా టికెట్ పై నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎన్నికై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్వీకర్ కు వైకాపా చీఫ్ విప్ మార్గని భరత్ ఫిర్యాదు చేశారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను తాము స్పీకర్ కు సమర్పించామన్నారు.