Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో తన సతీమణికి కాన్పు చేయించి ఆదర్శంగా నిలిచాడు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కల్పించాలనే ఉద్దేశంతో తన సతీమణి గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం అయ్యే వరకు.. అన్ని పరీక్షలు సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే చేయించారు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వీ పాటిల్. ఈ క్రమంలోనే ఈరోజు చేసిన కాన్పులో పండంటి మగబిడ్డకు కలెక్టర్ జితేష్ వీ పాటిల్ సతీమణి శ్రద్ధ జన్మనిచ్చారు.