
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, ఎంఐజీ లే అవుట్లపై సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 25 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలని సీఎం ఆదేశించారు. ఫేజ్ -1 లో భాగంగా 85,888 ఇళ్ల పనులు పూర్తి చేశామని సీఎం కు అధికారులు వివరించారు. మౌలిక వసతులు పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. డిసెంబర్ నాటికి లబ్దిదారులకు ఇళ్లు అందిస్తామని అధికారులు చెప్పారు.