
రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ రివ్యూ నిర్వహించారు. నీటి పారుదల, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. రిజర్వాయర్లు, ప్రాజెక్టుల నుంచి నీటిని నెమ్మదిగా వదలాలని తెలిపారు. ప్లడ్ మేనేజ్ మెంట్ టీమ్ ను పర్మినెంట్ గా ఏర్పాటు చేసుకోవానలి సీఎం ఆదేశించారు. పాత రికార్డులను అనుసరించి వరద సమయల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.