
గతంలో శాలపల్లిలో ప్రారంభించిన రైతు బంధు అద్భతమైన ఫలితాలు సాధిస్తోందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధును ను కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. దళిత బంధు విజయం సాధించి తీరుతుందని, దాన్ని మరింత విజయవంతం చేయాల్సిన బాధ్యత దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు యువతదేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ పథకం ఏడాది కిందనే మొదలు కావాలి. కానీ కరోనా వల్ల సంవత్సరం ఆలస్యమైందని అన్నారు. దళిత బంధు అందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు ఇస్తామని తెలిపారు. దళిత మేధావులు, రచయితలు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువతకు మనవి చేస్తున్నా, ఈ పథకాన్ని విజయవంతం చేసే బాధ్యత మీ మీదనే ఉంది అని సీఎం తెలిపారు.