
కడప జిల్లాలోని మామిళ్లపల్లె శివారులో ముగ్గురాయి క్వారీలో జరిగిన పేలుడు లో 10 మంది మరణించారు. ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేలుడు ఘటన జరగటానికి గల కారణాలను జగన్ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.