
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వీ జయరాం (70) కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రముఖ దవాఖానలో చేరారు. గురువారం రాత్రి పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. జయరాం స్వస్థలం వరంగల్. సినీరంగం మీద ఉన్న ఆసక్తితో చిన్న వయసులోనే చెన్నై వెళ్లి సినిమోటోగ్రాఫర్ గా స్థిరపడ్డారు. అనేక మలయాళం, తెలుగు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు లాంటి ప్రముఖ హీరోల సినిమాలకు పనిచేశారు.