https://oktelugu.com/

Vitamin D : విటమిన్ డి లోపంతో పిల్లలు బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు పాటించండిలా!

ఈ రోజుల్లో చాలామంది పిల్లలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఈ లోపం వల్ల పిల్లలు చిన్నప్పటి నుంచి ఇబ్బంది పడుతారు. ముఖ్యంగా పిల్లలు భవిష్యత్తులో టైప్ 1 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 9, 2024 / 06:00 AM IST

    Vitamin D

    Follow us on

    Vitamin D : ఈరోజుల్లో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు అయితే చాలా మంది చిన్నప్పటి నుంచే పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నతనంలో సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చాలా మంది పిల్లలు కొన్ని సమస్యల లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతున్నారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి సూర్యరశ్మిలో లేకపోవడం వల్ల వారికి అసలు విటమిన్ డి అందదు. సాధారణంగా ఎవరికైనా కూడా ఉదయం, సాయంత్రం వేళలో గంట సమయం సూర్యరశ్మిలో ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. అయిన కూడా కొందరు పూర్తిగా ఉండరు. పెద్ద వాళ్లు అయితే ఏదో విధంగా బయటకు వెళ్లడం వల్ల కాస్త ఎండ తగులుతుంది. కానీ పిల్లలుకు తల్లిదండ్రులే సూర్యరశ్మిలో ఉంచాలి. లేకపోతే విటమిన్ డి అందక.. ఆ లోపంతో బాధపడతారు. శరీరానికి విటమిన్ డి లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మానసికంగా బాధ పడటం వంటి సమస్యల బారిన పడతారు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఈ లోపం వల్ల పిల్లలు చిన్నప్పటి నుంచి ఇబ్బంది పడుతారు. ముఖ్యంగా పిల్లలు భవిష్యత్తులో టైప్ 1 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    పిల్లల్లో విటమిన్ డి లోపం రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పిల్లలకు సరైన ఆహారం లేకపోవడం, రెండోది తగినంత విటమిన్ డి శరీరానికి లభించనప్పుడు ఈ లోపం వస్తుంది. ఎండలో ఉన్న కూడా బాడీకి సరైన విటమిన్ డి అందలేదంటే.. తినే ఫుడ్ కూడా కారణం అవుతుంది. అయితే విటమిన్ డి లోపం వల్ల చర్మంలోని మెలనిన్ (పిగ్మెంట్) పరిమాణం, పేగు శోషణ బలహీనపడటం, కాలేయం, మూత్రపిండాలలో క్రియాశీలత బలహీనపడటం వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందట. భారతదేశంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా 70-80 శాతం భారతీయులు విటమిన్ డి లోపం బాధపడుతున్నారు. పిల్లలో ఈ లోపం వల్ల కండరాలు, ఎముకలు బలహీనంగా మారుతాయి. ఈ లోపం బారిన పడిన పిల్లలో గొంతు నొప్పి, ఎముకలు బలహీనంగా, కండరాలు బలహీనంగా, ఎముకలు నొప్పి, కీళ్ల నొప్పులు, విటమిన్ డి లేకపోవడం, అలసట, తిమ్మిర్లు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే పిల్లలని రోజూ సూర్యరశ్మిలో కొంత సమయం ఉంచాలి. అలాగే విటమిన్ డి కోసం తృణ ధాన్యాలు, పాలు, పెరుగు, పోషకాలు ఉండే ఆహారాన్ని పెట్టాలి. తప్పకుండా ఉదయం పూట పిల్లలను గంట సమయం పాటు ఎండలో ఉంచాలి. అప్పుడే ఈ విటమిన్ డి సమస్య నుంచి విముక్తి పొందుతారు. లేకపోతే సమస్య తీవ్రం అయ్యి ఇంకా అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ చిట్కాలు పాటిస్తూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.