CM Chandrababu: జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వెలగపూడిలోని సచివాలయం వద్ద ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చిందని అన్నారు. భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వనరని అన్నారు. దేశమంటే మనుషులు అనే నినాదానికి సార్దకత చేకూరాలని సీఎం అన్నారు.
జనాభా నియంత్రణ కాదు… జనాభా నిర్వహణ చేయాలి…
నేను సమైక్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకొచ్చాను.
ఈరోజు నేనే మళ్ళీ జనాభా నిర్వహణకు మీ సూచనలు అడుగుతున్నా – సీఎం @ncbn pic.twitter.com/P40HT8jO5z
— greatandhra (@greatandhranews) July 11, 2025