https://oktelugu.com/

Chengala Venkatarao : హోం మంత్రిపై తొడగొట్టనున్న సమరసింహారెడ్డి నిర్మాత!

2029 ఎన్నికల ధ్యేయంగా జగన్ పావులు కదుపుతున్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉన్నారు.అందులో భాగంగా బలమైన నేతలను నియోజకవర్గ ఇన్చార్జిలుగా నియమించాలని చూస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 9, 2024 / 12:12 PM IST

    Chengala Venkatarao

    Follow us on

    Chengala Venkatarao :  వైసిపి బలోపేతంపై ఫోకస్ పెట్టారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా చాలా రకాల మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రాన్ని ఆరు రీజియన్లుగా నియమించి సమన్వయకర్తలను నియమించారు. ఒక్కో ప్రాంతాన్ని తనకు నచ్చిన నేతకు అప్పగించారు. అదే సమయంలో నియోజకవర్గాలు ఇన్చార్జులను సైతం మార్చుతున్నారు. ఎన్నికలకు ముందు గెలుపు వ్యూహంలో భాగంగా 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు. సర్వేలో వెనుకబడ్డారని చెప్పి చాలా రకాల మార్పులు చేశారు. అయినా సరే వైసీపీకి ఓటమి తప్పలేదు. భారీ ఓట్ల తేడాతోనే అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. దీంతో ఇప్పుడు నియోజకవర్గాలను మార్చుతున్నారు. అయితే చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అందులో అందరూ తాజా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. దీంతో వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారు జగన్. తాజాగా మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేట ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. అలాగే కూటమి కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో గట్టి నేతలను ఇన్చార్జిలుగా పెట్టాలని భావిస్తున్నారు. 2029 ఎన్నికల నాటికిబలమైన అభ్యర్థులుగా మారుతారని భావిస్తున్న నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

    * పాయకరావుపేట పై ఫోకస్
    పాయకరావుపేట నియోజకవర్గం పై ఫోకస్ పెట్టారు జగన్. అక్కడ ఎమ్మెల్యేగా వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం హోం శాఖ మంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోఆమెను ఓడించాలని కృత నిశ్చయంతో ఉన్నారు.అందుకే మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఆయన 2004లో టిడిపి తరఫున పోటీ చేసి గెలిచారు. నందమూరి బాలకృష్ణకు సన్నిహితుడు. ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ సమరసింహారెడ్డి సినిమాకు నిర్మాత కూడా చెంగల వెంకట్రావు. తరువాత చాలా సినిమాలు తీసినా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పుడు అదే చెంగల వెంకట్రావును వంగలపూడి అనిత పై ప్రయోగించనున్నారు జగన్.

    * ఇన్చార్జిగా చెంగల వెంకట్రావు
    2019 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గొల్ల బాబురావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం గెలిచారు బాబురావు.అందుకే జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించారు. దక్కకపోయేసరికి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గొల్ల బాబురావుకు రాజ్యసభ పదవి ఇచ్చారు జగన్. పాయకరావుపేట నియోజకవర్గం నుంచి.. విజయనగరం జిల్లా రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులును బరిలో దించారు. అయినా సరే జోగులు ఓడిపోయారు. ఇప్పుడు చెంగల వెంకట్రావును బరిలో దించుతారని తెలుస్తోంది. త్వరలో నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటిస్తారని సమాచారం.