ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడి భారీగా డబ్బు వసూలు చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసు స్టేషన్ పరిధిలో పోలీస్ డిపార్ట్మెంట్ లో క్లర్క్ ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి 7 లక్షలు చొప్పున 1 కోటి రూపాయలు వసూలు చేసిన వారి గుట్టు రట్టు చేశారు కర్నూలు పోలీసులు. కర్నూలు డీఐజీ పేరుతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ సృష్టించి రైల్వేలో ఉద్యోగాల పేరుతో అవుకులో10 లక్షలు, , […]

Written By: NARESH, Updated On : August 20, 2021 11:40 am
Follow us on

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడి భారీగా డబ్బు వసూలు చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీసు స్టేషన్ పరిధిలో పోలీస్ డిపార్ట్మెంట్ లో క్లర్క్ ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి 7 లక్షలు చొప్పున 1 కోటి రూపాయలు వసూలు చేసిన వారి గుట్టు రట్టు చేశారు కర్నూలు పోలీసులు. కర్నూలు డీఐజీ పేరుతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ సృష్టించి రైల్వేలో ఉద్యోగాల పేరుతో అవుకులో10 లక్షలు, , ఆలూరు లో 18లక్షల 30 వేలు వసూలు చేసినట్టు తేలింది. ఇప్పటివరకు నలుగురు ముద్దాయిలు అరెస్ట్,3 కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిరుద్యోగులు దళారులను నమ్మొద్దు అని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఐపీఎస్ తెలిపారు