
ఏపీలో నేటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేశారు. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉన్నాయి. అయితే శుక్రవారం నుంచి మరో రెండు గంటలు సడలింపు ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూను సడలించనున్నారు. మధ్యాహన్నం 2 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అయితే కర్ఫ్యూ సమయంలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హచ్చరించారు.