
భారత్, శ్రీలంక వన్డే సిరీస్ కు సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో తొలి వన్డే మొదలవ్వనుంది. చాన్నాళ్లు నుంచి పరిమిత ఓవర్లు క్రికెట్ మెరుపులు లేకపోవడంతో అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. తొలి వన్డే జరగనున్న ప్రేమదాస స్టేడియంలో ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వరుణుడు బ్యాటింగ్ చేయొచ్చు. చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం కొలంబోలో ఆకాశం మేఘావృతమైంది. మైదానం చుట్టూ నల్లని మబ్లులు కమ్ముకున్నాయి.