Telugu News » National » Central cabinet convened for the first time in a year
ఏడాది తర్వాత తొలిసారి సమావేశమైన కేంద్ర కేబినెట్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. ప్రధాని మోదీ అధికార నివాసంలో ఈ సమావేవం జరిగింది. వర్చువల్ తరహాలో కాకుండా ఫిజికల్ మీటింగ్ జరగడం ఏడాది తర్వాత ఇదే ప్రథమం. జూలై 7న మంత్రి వర్గ పునర్వవస్థీకరణ తర్వాత మంత్రులంతా సమావేశం కావడం కూడా ఇదే మొదటిసారి. రెండు రోజుల క్రితం కేబినెట్ కమిటీలను పునర్వవస్థీకరించిన తర్వాత ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.