
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాజనీతిజ్ఞుడు, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి పీవి నరసింహారావు అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆర్థిక సంస్కరణలతో పీవీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. పీవీ తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. పాలనా దక్షుడిగా రాజనీతిజ్ఞుడిగా పీవీ ప్రజ్ఞ అమోఘమని కొనియాడారు.