
సీనియర్ బ్యూరోక్రాట్ జగన్నాథ్ బిద్యాధర్ మోహపాత్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ గా నియామకమయ్యారు. ఈ మేరకు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం ఆదాయపు పన్ను విభాగానికి పాలసీని రూపొందించే బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. కేబినెట్ అపాయింట్ మెంట్స్ కమిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఛైర్మన్ గా జేబీ మోహపాత్ర నియామకాన్ని ఆమోదించింది.