శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల కేసు

తమిళనాడుకు చెందిన ఆధ్యాత్మిక గురువు శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. చెన్నై సమీపంలోని కేలంబక్కం వద్ద సుశీల్ హరి ఇంటర్నేషనల్ రెసిడెన్సియల్ స్కూల్ ను ఆయన నిర్వహిస్తున్నారు. కాగా శివశంకర్ బాబా తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ విద్యా సంస్థలో చదివిన పలువురు విద్యార్థులు ఆరోపించారు. తాము ఎదుర్కొన్న వేధింపులకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన పిల్లల సంక్షేమ సంఘం తమ ఎదుట హాజరు కావాలని […]

Written By: Suresh, Updated On : June 13, 2021 7:55 pm
Follow us on

తమిళనాడుకు చెందిన ఆధ్యాత్మిక గురువు శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. చెన్నై సమీపంలోని కేలంబక్కం వద్ద సుశీల్ హరి ఇంటర్నేషనల్ రెసిడెన్సియల్ స్కూల్ ను ఆయన నిర్వహిస్తున్నారు. కాగా శివశంకర్ బాబా తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ విద్యా సంస్థలో చదివిన పలువురు విద్యార్థులు ఆరోపించారు. తాము ఎదుర్కొన్న వేధింపులకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన పిల్లల సంక్షేమ సంఘం తమ ఎదుట హాజరు కావాలని శివశంకర్ బాబాకు సమన్లు జారీ చేసింది.