HomeతెలంగాణBus Travel Safety Tips: బస్సులో ప్రయాణిస్తున్నారా.. జాగ్రత్త..

Bus Travel Safety Tips: బస్సులో ప్రయాణిస్తున్నారా.. జాగ్రత్త..

Bus Travel Safety Tips: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటూ ‘బస్సులో భరోసా’ అనే వినూత్న భద్రతా వ్యవస్థను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ వ్యవస్థ, ప్రజా రవాణాలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో బస్సులో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఒకవేళ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే తెలిసిపోతుందని చెబుతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే?

బస్సులో ప్రయాణించే వారి భద్రత దృష్ట్యా.. ముఖ్యంగా మహిళలను వేధింపుల నుంచి రక్షించేందుకు తెలంగాణ ఆర్టీసీ కొత్త భద్రతా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ప్రతి బస్సులో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు. ఇవి బస్సులోని ప్రతి అంగుళాన్ని స్పష్టంగా రికార్డ్ చేస్తాయి. బస్సులోకి ప్రవేశించే ఫుట్ బోర్డు దగ్గర నుంచి చివరి సీటు వరకు, కెమెరాల నిఘాలో ఉంటుంది. దీనివల్ల ప్రయాణికుల కదలికలు నిరంతరం కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించబడతాయి.

తొలి దశలో భాగంగా, ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని 175 బస్సుల్లో ఈ అధునాతన కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో సక్సెస్ రేటును బట్టి, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సులకు ఈ వ్యవస్థను విస్తరించే అవకాశం ఉంది. ఈ ‘బస్సులో భరోసా’ కార్యక్రమం ద్వారా బస్సుల్లో జరిగే వేధింపులు, దొంగతనాలు మరియు అనుచిత ప్రవర్తనలను సమర్థవంతంగా అరికట్టవచ్చని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు భయం లేకుండా సురక్షితంగా ప్రయాణించే వాతావరణాన్ని కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.

ఈ భద్రతా చర్యలు ప్రయాణికులకు మరింత భరోసానివ్వడమే కాకుండా, ఆర్టీసీ బస్సులపై ప్రజల్లో నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల నేరస్థులు నేరాలకు పాల్పడటానికి వెనకడుగు వేసే అవకాశం ఉందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper