
ఏపీ ఆర్థిక పరిస్థితిపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. టీడీపీ సీనియర్ నేత, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. ఆడిట్ సంస్థ ప్రశ్నల ఆధారంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారన్నారు. పీఏసీ ఛైర్మన్ కు అనుమానాలు ఉంటే ప్రభుత్వం నుంచి వివరణ తీసుకోవచ్చన్నారు. సందేహాలు ఉంటే సమావేశం ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని సూచించారు. లేఖలు రాయడం వల్ల ప్రయోజనమేంటో అర్థం కావడం లేదని ఆక్షేపించారు.