Homeజాతీయం - అంతర్జాతీయంప్రేయసితో బ్రేకప్.. 15 వాహనాల ధ్వంసం

ప్రేయసితో బ్రేకప్.. 15 వాహనాల ధ్వంసం

ప్రియురాలితో బ్రేకప్ ను తట్టుకోలేక ఓ యువకుడు ఆ కోపాన్ని వీధుల్లో ఉంచిన కార్లపై చూపించాడు. ఏ కారు కనిపిస్తే దానిపై తన ప్రతాపాన్ని చూపించాడు. ఇలా ఏకంగా 15 కార్లను ధ్వంసం చేశాడు. ఈ ఘటన కర్ణాటన రాజధాని బెంగళూరులోని పశ్చిమ జోన్ లో  జరిగింది.  రాత్రి వరకు బాగానే ఉన్న తమ కార్లు ఉదయం లేచేసరికి ధ్వంసమై కనిపించడంతో ఆ వాహనాల యజమానులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. వీధిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ఓ యువకుడు కార్లను రాడ్డుతో ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కోపంతో ఈ పని చేసినట్లు సదరు యువకుడు పోలీసులకు వెల్లడించాడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version