
తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అర్హత కేటీఆర్ కు లేదని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో మాట్లాడుతూ సీఎం అయ్యే అర్హత ఈటల రాజేందర్, హరీష్ రావులకు ఉందన్నారు. ఇంకా చెప్పాలంటే పోచారం శ్రీనివాసరెడ్డికి ఉందన్నారు. తనకు టీఆర్ ఎస్ నాయకులతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. వ్యక్తిగతంగా కేటీఆర్ చాలా మంచి వ్యక్తేనని, అయితే ముఖ్యమంత్రికి ఆయన సూటబూల్ కాదన్నారు.