https://oktelugu.com/

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ తో సినిమా చేయాలని ఉంది అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోలు…

సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ గా మారిపోయింది. ఇక తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న చాలామంది స్టార్ హీరోలు సైతం వాళ్ళు చేయబోయే సినిమాల మీద భారీ ఫోకస్ చేసి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : November 22, 2024 / 01:55 PM IST

    Bollywood star heroes who say that they want to do a film with Sandeep Reddy Vanga...

    Follow us on

    Sandeep Reddy Vanga :  సినిమా అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ గా మారిపోయింది. ఇక తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న చాలామంది స్టార్ హీరోలు సైతం వాళ్ళు చేయబోయే సినిమాల మీద భారీ ఫోకస్ చేసి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా ప్రతి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాబట్టి మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగితే ప్రతి ఒక్క సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఈయన చేసిన అనిమల్ సినిమా గత సంవత్సరం వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా ఆయన పేరు ఇండియాలో మారూమ్రోగిపోయిందనే చెప్పాలి. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి చాలామంది బాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే అమీర్ ఖాన్,షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు అతనితో సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపించడమే కాకుండా ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుకున్నట్టుగా తెలుస్తోంది. మరి సందీప్ రెడ్డి వంగా మాత్రం ప్రస్తుతం తను చేస్తున్న స్పిరిట్ సినిమా మీదనే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఈ క్రమంలో బాలీవుడ్ హీరోలతో తను సినిమాలు చేసే అవకాశం లేదన్నట్టుగా సంకేతాలైతే అందుతున్నాయి. ఇక ఇప్పటికే రన్బీర్ కపూర్ తో చేసిన అనిమల్ సినిమా మీద బాలీవుడ్ ప్రేక్షకులు మంచి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

    ఇక అక్కడ ఉన్న కొంతమంది సినిమా మేకర్స్ మాత్రం ఈ సినిమా మీద తీవ్రమైన విమర్శలైతే చేశారు. అలాగే బాలీవుడ్ మాఫియా కూడా తనను చాలా వరకు ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.

    ఇక బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పిస్తూ బాలీవుడ్ హీరోలకు సైతం చుక్కలు చూపిస్తున్న ఈ దర్శకుడు తన తదుపరి సినిమాలతో భారీ ఇండస్ట్రీ హిట్లను నమోదు చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ప్రస్తుతం చేస్తున్న స్పిరిట్ సినిమాతో తను రెండువేల కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

    అయితే ఈ సినిమా కోసం దాదాపు 600 కోట్ల బడ్జెట్ ను కూడా కేటాయిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్న సందీప్ రెడ్డి వంగ మరిన్ని వండర్స్ ని క్రియేట్ చేయాలని కోరుకుందాం…