
బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్ లో పాటు ఇతర ఆరోగ్య బీయా పథకాల్లో చేర్చాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎపిడెమిక్ యాక్ట్ -1897 ప్రకారం బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ నోటిఫైడ్ వ్యాధిగా గుర్తించాలని, ఆ కేసుల వివరాలను నివేదించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన లిపోసోమల్ ఆంఫోటెరిసిస్- బీ మందు కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు.