
ఉత్తరప్రదేశ్ లోని కాశలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల గురించి అక్కడి డాక్టర్లు, ప్యారా మెడికల్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతో ప్రధాని మోదీ వీడియో సమావేశం నిర్వహించారు. కోవిడ్ 19 పై పోరాడుతున్న సమయంలో బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త సవాల్ ఎదురైందని ఆ వ్యాధిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకునే రీతిలో దృష్టి పెట్టాలన్నారు. వ్యాక్సినేషన్ వల్ల ఫ్రంట్ లైన్ వర్కర్లకు రక్షణ కలిగిందని, వారంతా ప్రజా సేవ చేస్తున్నారని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ టీకాలు ఇవ్వనున్నట్లు ప్రధాని అన్నారు.