Bigg Boss Telugu 9 contestents బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ సారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా సెలబ్రిటీలే హౌస్‌లోకి ప్రవేశించే ఈ రియాలిటీ షోలో ఈసారి కామనర్స్‌కి కూడా అవకాశం కల్పించారు. ఈ ఎంపిక కోసం ప్రత్యేకంగా ‘అగ్నిపరిక్ష’ అనే ప్రీ-షో నిర్వహించారు.
ఈ షోను బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు బిందు మాధవి, నవదీప్, అభిజీత్ జడ్జ్‌లుగా తీర్పు ఇచ్చారు. మొత్తం 45 మంది పాల్గొనగా, మానసిక , శారీరక పరీక్షల్లో మెరుగ్గా నిలిచిన 15 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. వీరిలో మణీష్, ప్రియ, అనుష, స్రిజా, పవన్, ప్రసన్న, శ్రేయ, షకీబ్, స్వేత, నాగ, కల్కి, కల్యాణ్, హరిష్, దివ్య, దాలియా ఉన్నారు.
అయితే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ప్రకటించిన ప్రకారం కామనర్స్ అయిన స్రిజా దమ్ము, ప్రియ, డెమన్ పవన్, హరిటా హరిష్, పవన్ కల్యాణ్ పడాల, మర్యాద మణీష్ ప్రధాన బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ పొందారు.
ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్లుగా సంజ్ఞాన గల్రాణి, సుమన్ సెట్టి, తనూజ పుట్టస్వామి, ఫ్లోరా సైనీ, జబర్దస్త్ ఇమ్మానుయేల్, రితు చౌదరి, భరణి శంకర్, శ్రేష్టి వర్మ, రాము రాథోడ్ లను ఎంపిక చేశారు. వీరికి ప్రత్యేకంగా సౌకర్యాలు తక్కువగా ఉన్న రెండో హౌస్ కేటాయించారు.
ప్రోగ్రాం ప్రారంభంలోనే నాగార్జున కామనర్ కంటెస్టెంట్ ప్రియకు ఒక టాస్క్ ఇచ్చారు. కిచెన్ బాధ్యతలు చూసుకునే కో-కంటెస్టెంట్‌ను ఎంపిక చేయమని చెప్పగా, ప్రియ సంజ్ఞాన గల్రాణిని ఎన్నుకుంది. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో మొదటి రోజు నుంచే ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది.
ఈసారి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాన్సెప్ట్‌తో బిగ్ బాస్ తెలుగు 9 మరింత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రేక్షకులు ఎవరి వైపు నిలుస్తారో, ఎవరెవరూ గేమ్‌లో బలంగా నిలుస్తారో చూడాలి.
#BiggBossTelugu9 Launch Shoot started:
5 Commoners:
Harish, Srija, Manish, Priya and Soldier Kalyan.
9 Celebrities:
Tanuja, Bharani, Emmanuel, Asha Saini, Rithu Suman shetty, Shresti Varma, Ramu Rathod, Sanjana #BiggBossTelugu #biggbossagnipariksha #NagarjunaAkkineni pic.twitter.com/r7gNrKRQIN
— DarshXplorer. (@diligentdarshan) September 6, 2025