
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మంచ తల పెట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఆదివారం శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగింది. మజీన్ ప్రాంతంలోని జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి వెంట ఆలయ నిర్మాణ ప్రదేశంలో కేంద్ర మంత్రులు జితేంద్రసింగ్, కిషన్ రెడ్డితో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భూమిపూజ చేశారు. టీటీడీలోని 28 బోర్డు సభ్యులతో పాటు ఆంధ్రపదేశ్ కు చెందిన పలువురు శాసన సభ్యులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమక్షంలో వేడుక ఘనంగా జరిగింది.