Homeక్రీడలుక్రికెట్‌Ben Stokes retirement : బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. బజ్ బాల్ మొనగాడు.. ఇంగ్లాండ్ రాతను...

Ben Stokes retirement : బెన్ స్టోక్స్ రిటైర్మెంట్.. బజ్ బాల్ మొనగాడు.. ఇంగ్లాండ్ రాతను మార్చిన ఆటగాడు..

Ben Stokes retirement : అది 2019 వన్డే ప్రపంచ కప్.. ఫైనల్ మ్యాచ్.. అప్పటిదాకా ఇంగ్లాండ్ ఒక్క వన్డే వరల్డ్ కప్ కూడా అందుకోలేదు. క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ దేశానికి ఇది ఒక వెలితి. సరిగ్గా 2019లో ఇంగ్లాండ్ ఫైనల్ వెళ్ళింది. నాటి మ్యాచ్లో ఒక ఆటగాడు 84 పరుగులు చేశాడు. చివరి వరకు నాట్ అవుట్ గా నిలిచాడు. అతడు ఆడిన ఆ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ జట్టును విజేతగా నిలిపింది. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టుకు అతడిని హీరోగా చేసింది. అతడు మరెవరో కాదు బెన్ స్టోక్స్.

బౌలింగ్ వేయగలడు. బ్యాటింగ్ చేయగలడు.. మెరుపు వేగంతో బంతులను కూడా ఆపగలడు. అందువల్లే అతడు అండ్రూ ప్లింటాఫ్ తర్వాత ఆ స్థాయిలో ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు. 2019లోనే హెడింగ్ లీ లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు సాధించిన 135* పరుగులు యాషెస్ సిరీస్ లోనే అత్యంత చారిత్రాత్మకమైనవి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు స్టోక్స్.

2022లో ఇంగ్లాండ్ టెస్ట్ సారధి స్థానం నుంచి రూట్ తప్పకుండా తర్వాత రెడ్ బాల్ బాధ్యతలను స్టోక్స్ అందుకున్నాడు. హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ తో కలిసి బాజ్ బాల్ క్రికెట్ ను ప్రవేశపెట్టాడు. న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా.. పాకిస్తాన్.. ఇతర దేశాల మీద ఇంగ్లాండ్ ఈ క్రికెట్ ద్వారానే సిరీస్ విజయాలు నమోదు చేసింది. అంతేకాదు టెస్ట్ క్రికెట్ కు సరికొత్త ఊపిరి అందించింది.

స్టోక్స్ గడిచిన కొంతకాలంగా గొప్ప ఫామ్ లో లేడు. బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాడు. బౌలింగ్ కూడా సరైన దిశలో వేయలేకపోతున్నాడు. దీనికి తోడు ఇటీవల యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోయింది. అంతకుముందు ఇండియా చేతిలో కూడా వరుస ఓటములు ఎదురయ్యాయి. దీనికి తోడు స్టోక్స్ మద్యం తాగి గొడవలు పెట్టుకోవడం వల్ల పరుగు పోగొట్టుకున్నాడు. ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. ఆమధ్య ప్రాక్టీస్ చేస్తుండగా బంతి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కొద్దిరోజులపాటు ఆస్పత్రి పాలయ్యాడు. తిరిగి మళ్ళీ జట్టులోకి వచ్చినప్పటికీ మునుపటి మాదిరిగా ఆడలేక పోతున్నాడు. అందువల్లే ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న సిరీస్ లోనే అతడు టెస్ట్ క్రికెట్ నుంచి తట్టుకున్నాడు. ఇప్పటికే అతడు టి20, వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular