
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీల్ మ్యాచ్ లన్ని కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండా జరుగుతున్న విషయం తెలిసిందే. బయో బబుల్ వాతావరణంలో బీసీసీఐ ఈ మ్యాచ్ లను నిర్వహిస్తుంది. ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యాజమానులు, జట్టులో మిగతా స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా క్వారంటైన్ రూల్స్‌కు కట్టుబడి ఉండాలనేది బీసీసీఐ నిబంధన. ఈ నిబంధనలు ఎవరు ఉల్లంఘించిన 6రోజుల పాటు కచ్చితంగా క్వారంటైన్ వుండాల్సిందేనని తెలిపింది. తొలిసారి నిబంధన ఉల్లంఘనకే రూ. 1 కోటి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని అన్ని ఫ్రాంచైజీలకు నోటిఫికేషన్‌ను బీసీసీఐ పంపింది.