
తెలంగాణలో భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 9న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బండి సంజయ్ పాదయాత్ర ఉంటుందని గతంలో నిర్ణయించాం. కానీ పార్లమెంట్ సమావేశాలు, ముఖ్యమైన బిల్లుల దృష్ట్యా ఆగస్టు 24కు వాయిదా వేశాం అని తెలిపారు. ప్రజా దీవెనయాత్రలో ఈ రాజేందర్ గాయమైన కారణంగా పాదయాత్రను తాత్కిలిక విరామమిస్తున్నామని తెలిపారు.