
ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. మంగళవారం ఉదయం 4.15 గంటలకు బ్రహ్మముహుార్త సమయంలో పూజరులు తలుపులు తెరువగా అంతకు ముందు సంప్రాదాయ పూజలు చేశారు. ధర్మాధికారులు, దేవస్థానం బోర్డు అధికారులు ఉద్యోగులు కార్యక్రమానికి హాజరయ్యారు. కొవిడ్ మార్గదర్శకాల మేరకు పాండుకేశ్వర్ నుంచి ఉత్సవ్ డోలి తీసుకురాగా బద్రీనాథ్ ధామ్ ప్రధాన పూజరి రావల్ ఈశ్వర్ ప్రసాద్ నంబ్రూద్రి, ధర్మధికారి భువన్ ఉనియల్, అదనపు ధర్మధికారి పూజాగి గనా హాజరయ్యారు.