
నెల్లూరు జిల్లాలో యువతిపై విచక్షణారహితంగా దాడి చేసిన వెంకటేశ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామకోటయ్యనగర్ కు చెందిన యువతిపై వెంకటేశ్ పాశవికంగా దాడి చేశాడు. యువతి ఎంత బతిమాలినా కనికరం లేకుండా కర్రతో చితకబాదాడు. తాను దాడి చేస్తున్న దృశ్యాలను శివకుమార్ అనే వ్యక్తితో వీడియో తీయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, పోలీసులు స్పందించి వారిద్దరిని అరెస్ట్ చేశారు.