Mohsin Naqvi : పాకిస్తాన్ దేశమే కాదు.. అక్కడి పాలకులు కూడా దుర్మార్గులే. ఇది అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు కూడా నిరూపితం అవుతోంది. చివరికి క్రికెట్ జట్టును పర్యవేక్షించే వ్యక్తులు కూడా దుర్మార్గంగానే వ్యవహరిస్తున్నారు. భారత్ మీద విషాన్ని కక్కుతున్నారు. ప్లేయర్లు మాత్రమే కాదు.. బోర్డును పర్యవేక్షించేవారు కూడా ఇలా వ్యవహరించడం పట్ల యావత్ క్రికెట్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇటీవల ఆసియా కప్ జరిగింది. ఇందులో టీమిండియా ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై అద్భుతమైన విజయం సాధించింది. ట్రోఫీ అందుకునే విషయంలో టీమిండియా నిరసన వ్యక్తం చేసింది. పహల్గాం దాడి, సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీమిండియా ఎసిసి చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి ఆసక్తిని ప్రదర్శించలేదు. టీమిండియా ప్లేయర్ల నిరసన నేపథ్యంలో ఎసిసి చీఫ్ ఆసియా కప్, మెడల్స్ తన వెంట తీసుకొని పోయారు.
నఖ్వీ వ్యవహరిస్తున్న తీరు పట్ల భారత క్రికెట్ మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆసియా కప్ ఫైనల్ జరిగిన రెండు రోజుల తర్వాత ఎసిసి ఎజిఎం సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు ఎసిసి చీఫ్ కు గట్టి హెచ్చరికలు పంపించింది. ట్రోఫీ సరైన విధానాల్లో పంపించాలని.. లేకపోతే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. కాదు అధికారిక ఈమెయిల్ ద్వారా కూడా సందేశం పంపించింది. అయితే ఇప్పటివరకు ఏసీసీ చీఫ్ నుంచి ఎటువంటి ప్రత్యుత్తరం రాలేదు. దీంతో ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలికి తెలియజేస్తామని ఇప్పటికే భారత క్రికెట్ యాజమాన్యం ప్రకటించింది. ట్రోఫీని తమ వద్దకు ఎలా రప్పించుకోవాలో తెలుసని.. ఎందుకు దశలవారీగా ముందుకు సాగుతామని భారత క్రికెట్ యాజమాన్య ప్రకటించింది.. అయితే ఎసిసి కార్యాలయంలో భారత జట్టుకు ట్రోఫీ అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని నఖ్వీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎసిసి చీఫ్ గా మాత్రమే కాకుండా, నఖ్వీ పాకిస్తాన్ మంత్రిగా కూడా ఉన్నారు. దీంతో అతని చేతుల మీదుగా ఎట్టి పరిస్థితుల్లో ట్రోఫీని తీసుకునే పరిస్థితి లేదని బీసీసీ స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆసియా కప్ దుబాయ్ లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉందని తెలుస్తోంది. అయితే ఆ ట్రోఫీని తన అనుమతి లేకుండా బయటికి తరలించకూడదని.. ఇతరులకు అప్పగించకూడదని నఖ్వీ ఆదేశాలు జారీ చేయడం విశేషం.