https://oktelugu.com/

Appudo Ippudo Eppudo Movie Review: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ‘ ఫుల్ మూవీ రివ్యూ…

ఇప్పుడు నిఖిల్ కూడా 'అప్పుడు ఇప్పుడో ఎప్పుడో' అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు... మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : November 8, 2024 / 02:55 PM IST

    Appudo Ippudo Eppudo Movie Review

    Follow us on

    Appudo Ippudo Eppudo Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి వీళ్ళు చేస్తున్న సినిమాలు ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి. అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంటుంది. ఇక ఈ మధ్య కిరణ్ అబ్బవరం లాంటి యంగ్ హీరో సైతం క సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు నిఖిల్ కూడా ‘అప్పుడు ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు… మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే నిఖిల్ తనను తాను ఒక గొప్ప రేసర్ గా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు… ఇక విదేశాల్లో తన సర్వైవల్ కోసం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆయన అనుకోకుండా ఒక మాఫియా చేతిలో ఇరుక్కుంటాడు. మరి ఆ మాఫియా నుంచి ఎలా బయటపడ్డాడు. చివరికి తను అనుకున్న గోల్ ను రీచ్ అయ్యాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో డైరెక్టర్ సుధీర్ వర్మ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే ఈ సినిమాకోసం ఆయన రాసుకున్న కథ బాగున్నప్పటికి దానిని పర్ఫెక్ట్ గా డెలివర్ చేయడం లో మాత్రం డైరెక్టర్ కొంతవరకు తడబడ్డాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా స్టార్ట్ అయిన మొదట్లో కొంతవరకు ఒకే అనిపించినప్పటికి ఆ తర్వాత మాత్రం ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను ఇవ్వలేకపోయింది. సినిమాలో రివిల్ చేసిన ట్విస్ట్ లు కూడా అంత బాగా సెట్ అవ్వలేదు…ఇక సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాసుకొని ఉంటే బాగుండేది. అలాకాకుండా తనకు నచ్చినట్టుగా రాసుకొని ప్రేక్షకులను నిరాశ పరిచారనే చెప్పాలి… ఇక ఈ సినిమా బ్యాగ్రౌండ్ అంత బాగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు.

    కొన్ని ఎలివేటెడ్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ అంత పర్ఫెక్ట్ గా లేకపోవడం వల్లే ఆ సీన్లు కూడా పెద్దగా పండలేదు. ఇక సత్య కామెడీ కొంతవరకు బాగానే అనిపించినప్పటికి ఓవరాల్ సినిమా నడిపించే కేపసిటి అయితే ఈ కామెడీ సీన్స్ కి లేదు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో నిఖిల్ మరొక సక్సెస్ అందుకుంటారని అందరు అనుకున్నారు. కానీ ఈ సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోతుందనే చెప్పాలి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టు పర్ఫామెన్స్ విషయానికి వస్తే నిఖిల్ లాంటి యంగ్ హీరో వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ‘కార్తీకేయ 2’ సినిమాతో పాన్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న ఈ నటుడు ఆ తర్వాత చేయబోయే సినిమాల మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మరి అలాంటి సమయంలో ఇలాంటి ఒక సినిమా ఎందుకు వచ్చింది. ఇలాంటి సినిమాలు అతడు చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. నిజానికైతే ఆయన ఈ సినిమాలో తన క్యారెక్టర్ ను కానీ సినిమా మాత్రం అతన్ని అంత బాగా ఎలివేట్ చేయలేదనే చెప్పాలి…

    ఇక రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్ ఇద్దరు కూడా వారి పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. అయితే వీళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ వచ్చే క్యారెక్టర్ కాకపోవడంతో వారు వాళ్ల పాత్రల వరకు బాగా చేశారు. నిజానికి వాళ్ళు ఫుల్ లెంత్ లో వాళ్లను వాడుకోలేకపోయారనే చెప్పాలి… ఇక కమెడియన్ సత్య, సుదర్శన్ కొంతవరకు వాళ్ల కామెడీ టైమింగ్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకుని కామెడీ పంచులైతే పేల్చారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అంత బాగా హెల్ప్ అయితే కాలేదు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత బాగా కుదరలేదనే చెప్పాలి. ఇక కొన్ని సీన్స్ ను బాగా ఎలివేట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా తగ్గడంతో సినిమాలు అంత బాగా ఎలివేట్ అవ్వలేదు… ఇక విజువల్స్ కూడా కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి ఒక మూడు తీసుకురావడంలో సినిమాటోగ్రాఫర్ కూడా కొంతవరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే ఉన్న దాంట్లో అవి కొంచెం డీసెంట్ గా ఉన్నాయి…