Ronald Wayne Apple story : ఈ ప్రపంచంలో దేన్నీ కూడా తక్కువగా చూడకూడదు. ఎందుకంటే చిన్నది కాస్త పెద్దదవుతుంది. ఆ తర్వాత మనల్ని ఆశ్చర్యంలో ముంచేస్తుంది. ఉదాహరణకు రామాయణంలో రాముడికి ఉడుత సహాయం చేసిందని విన్నాం. రాముడు ఆజానుబాహుడు.. అంతకుమించిన శక్తివంతుడు. కానీ ఉడుత అత్యంత చిన్న జంతువు. అయినప్పటికీ రాముడికి సహాయం చేసిందంటే మామూలు విషయం కాదు.
చిన్నవని తీసిపారేయకూడదు. ఎందుకంటే చిన్నవే పెద్దదిగా మారుతాయి. మన అంచనాలను మించి ఎదుగుతాయి. ఆ తర్వాత మనం చింతించినా ఉపయోగం ఉండదు. అంతటి ధీరుభాయ్ అంబానీ కూడా తన జీవితాన్ని సున్నా నుంచి మొదలు పెట్టాడు. ఎక్కడో గల్ఫ్ కంట్రీ కి వెళ్ళాడు. అక్కడ ఏవో పనులు చేశాడు. తర్వాత ఇండియాకు వచ్చాడు. ఆయిల్ రిఫైనరీ మొదలు పెట్టాడు. రకరకాల వ్యాపారాలు చేశాడు. కొడుకులు ఎదిగి వచ్చారు.. ఆ తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. ఈరోజు మన దేశ జిడిపిలో రిలయన్స్ వాటా ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కేవలం రిలయన్స్ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు.. పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు ఒకప్పుడు స్వల్ప స్థాయి నుంచి మొదలయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విలువైన కంపెనీగా ఆపిల్ కు గుర్తింపు ఉంది. అయితే ఈ కంపెనీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది..
ఆపిల్ కంపెనీని స్థాపించిన వారిలో రోనాల్డ్ వేన్ కూడా ఉన్నారు. ఈయన 1976లో కంపెనీని స్థాపించిన తొలి రోజుల్లోనే నష్టం వస్తుందని భయపడ్డారు. తన 10% వాటాను 800 డాలర్లకు అమ్ముకున్నారు. ఆ బాట విలువ నేడు 37 లక్షల కోట్లకు చేరుకుంది. ఇంతటి భారీ లాభాన్ని వదులుకున్నప్పటికీ.. ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు. పైగా ఆ నిర్ణయాన్ని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒకవేళ తాను ఆ పదవిలో కొనసాగి ఉంటే స్మశానంలో అత్యంత ధనవంతుడిగా ఉండే వాడినని చమత్కరించారు.
“డబ్బు కావాలనుకుంటే ఎలాగైనా సంపాదించవచ్చు. కానీ మానసిక ప్రశాంతత చాలా అవసరం. అందువల్ల నా జాగ్రత్తలో నేను ఉన్నాను. ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నాను. ఎటువంటి ఒత్తిడి లేదు. ఇబ్బంది అంతకంటే లేదు.. జీవితం సాఫీగా సాగిపోతోంది. ఏదో సాధించాలని కోరికతో నేను రాలేదు. ఆరోజు పెట్టుబడి పెట్టాను. భయం వల్ల వెనక్కి తీసుకున్నారు. ఒకవేళ ఆపిల్ కంపెనీ ఈ స్థాయిలో అభివృద్ధి చెందకపోతే నేను నష్టపోయేవాడిని కదా అంటూ” ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేన్ వ్యాఖ్యానించాడు.
